: నటుడు సాయికుమార్ తండ్రి పి.జె.శర్మ కన్నుమూత
డైలాగ్ కింగ్ సాయికుమార్ తండ్రి, సీనియర్ నటులు పి.జె.శర్మ నేటి ఉదయం కన్ను మూశారు. ఆయన మృతికి గుండెపోటు కారణమని తెలుస్తోంది. మనవడు ఆది పెళ్లి వేడుకలు పూర్తిగా ముగియకుండానే శర్మ మరణించడంతో సాయికుమార్ ఇంట విషాద వాతావరణం నెలకొంది. శర్మ మృతిపట్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సానుభూతి తెలిపింది. నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఎర్రగడ్డ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని తెలిసింది.