: నాని, నిఖిల్ 75 పరుగుల భాగస్వామ్యం... 10 ఓవర్లు ముగిసేసరికి శ్రీకాంత్ జట్టు స్కోరు 104/2
తుపాను బాధితుల సహాయార్థం విజయవాడలో నిర్వహిస్తున్న సినీతారల క్రికెట్ మ్యాచ్ ఉత్సాహంగా సాగుతోంది. టాస్ గెలిచిన తరుణ్ ప్రత్యర్థి శ్రీకాంత్ జట్టుకు బ్యాటింగ్ అప్పగించాడు. శ్రీకాంత్ ఎలెవెన్ తరపున ఓపెనర్లుగా దిగిన హీరోలు నాని, నిఖిల్ లు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరి జోడి 5 ఓవర్లలో 46 పరుగులు చేసింది. అనంతరం, 75 పరుగుల స్కోరు వద్ద నాని 30 పరుగులు చేసి తరుణ్ బౌలింగ్ లో అల్లరి నరేష్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అవగా, 76 పరుగుల వద్ద రెండో వికెట్ రూపంలో నిఖిల్ వెనుదిరిగాడు. ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో నిఖిల్ 40 పరుగులు చేసి ఔటయ్యాడు. 10 ఓవర్లు ముగిసేసరికి శ్రీకాంత్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది.