: ఇళయరాజాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అభి మ్యూజిక్


ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాపై ఒక ఆడియో సంస్థ నిర్వాహకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇళయరాజా పాటలకు సంబంధించి 2007లో తమ సంస్థ ఒక ఒప్పందం కుదుర్చుకుందని, ఈ ఒప్పందం కాల పరిమితి ముగియకుండానే ఇళయరాజా వేరే ఆడియో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారని అభి మ్యూజిక్ సంస్థ అధినేత అఖిలన్ లక్ష్మణ్ ఆరోపించారు. కొందరు వ్యక్తులు అభిమానుల పేరుతో ఆన్ లైన్ ద్వారా హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నారని కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ఇంతకుముందు అభి మ్యూజిక్ సంస్థ తన పాటలను తస్కరిస్తోందంటూ ఇళయరాజా చెన్నై పోలీసు కమిషనర్ జార్జ్‌కు ఫిర్యాదు చేశారు. రెండు కేసులూ ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.

  • Loading...

More Telugu News