: జమ్మూ కశ్మీర్, ఝార్ఖండ్‌లో మొదలైన పోలింగ్


భారీ పోలీసు బందోబస్తు మధ్య జమ్మూ కశ్మీర్, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో నాలుగో దశ ఎన్నికల పోలింగ్ నేటి ఉదయం ప్రారంభమైంది. జమ్మూ కశ్మీర్‌లోని 18 స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 182 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, ఇద్దరు సీఎం అభ్యర్థులు, శాసనసభాపతి, నలుగురు మంత్రుల భవితవ్యాన్ని ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు. ఇక ఝార్ఖండ్‌ విషయానికి వస్తే, 15 నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతుండగా, 217 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పలు ప్రాంతాల్లో ఓటింగ్ సాఫీగా సాగేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.

  • Loading...

More Telugu News