: మరో రెండ్రోజుల పాటు 'సెగ' తప్పదట!


రాష్ట్రాన్ని నిప్పుల కొలిమిలా భగభగలాడిస్తున్న భానుడి ప్రతాపం మరో రెండ్రోజుల పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం వీస్తోన్న వడగాడ్పులు ఇంకా రెండ్రోజులు తమ ప్రభావం చూపుతాయని.. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ వడగాడ్పులు ఎక్కువగా వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక నేడు నమోదైన ఉష్ణోగ్రతల వివరాలకొస్తే.. రెంటచింతలతోపాటు ఒంగోలులోనూ 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

  • Loading...

More Telugu News