: తిరుమలలో భక్తుల రద్దీ... దర్శనానికి 20 గంటల సమయం
వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న రాత్రికి మొత్తం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం, నడకదారి భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. ఉచిత, రూ.50, రూ.100, రూ 500ల గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. అన్నిరకాల వసతి గృహాలూ నిండిపోయి ఉన్నాయి. కాగా, ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 28 కంపార్ట్‌మెంట్లు నిండాయి.