: రాష్ట్రపతి ప్రణబ్ కు గుండె సమస్యలు... ఆంజియో ప్లాస్టీ చేసిన ఆర్మీ ఆసుపత్రి డాక్టర్లు


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ రెఫెరల్ ఆస్పత్రిలో ఆంజియో ప్లాస్టీ జరిగింది. గుండె కండరాలకు రక్తాన్ని చేరవేసే ధమనిలో అడ్డంకులు ఏర్పడటంతో హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆ వెంటనే వైద్యులు ధమనిలో ఏర్పడిన అడ్డంకిని తొలగించేందుకు స్టెంట్‌ను అమర్చారు. అంతకుముందు ఆయన కడుపునొప్పి, ఉదర సంబంధమైన సమస్యలతో ఇబ్బంది పడ్డారు. కాగా, మరో 2 రోజులు ఆయన ఆసుపత్రిలోనే ఉండాల్సి రావచ్చని తెలుస్తోంది. ఆసుపత్రిలో రాష్ట్రపతి ఆరోగ్యంపై పూర్తి పర్యవేక్షణ కొనసాగుతోందని, సోమవారానికి ఆయన ఆసుపత్రి నుంచి తిరిగివస్తారని భావిస్తున్నట్టు ప్రణబ్ ప్రెస్ సెక్రెటరీ రాజమొనీ వివరించారు.

  • Loading...

More Telugu News