: తాజ్ సందర్శనకు ఆన్‌లైన్‌లో టికెట్లు
ఆగ్రాలోని తాజ్‌మహల్ ను చూడాలనుకుంటే ఇకపై ఆన్ లైన్‌లో కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం రైల్వే టికెట్లు ఆన్ లైన్ లో విక్రయిస్తున్న ‘ఐఆర్‌సీటీసీ’ ద్వారా తాజ్ దర్శనానికి ముందస్తు బుకింగ్స్ చేసుకోవచ్చు. డిసెంబర్ 25 నుంచి ఆన్‌లైన్ బుకింగ్‌ను ప్రారంభించనున్నట్లు భారత పురావస్తు అధ్యయన సంస్థ (ఏఎస్‌ఐ) వెల్లడించింది.