: జనవరి 1న 'స్మార్ట్ ఆంధ్రప్రదేశ్' పథకం ప్రారంభం: చంద్రబాబు
జనవరి 1న 'స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ - స్మార్ట్ విలేజ్' పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. పథకాన్ని ప్రారంభించే రోజున దత్తత తీసుకున్న గ్రామాలను కేటాయిస్తామని చెప్పారు. పథకానికి సంబంధించిన ఏర్పాట్లను నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు, బ్యాంకర్లతో చంద్రబాబు సమావేశమయ్యారు. రెండో విడత రుణమాఫీ, తదితర అంశాలపై వారితో చర్చించారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలను స్మార్ట్ విలేజ్ కాన్సెప్ట్ తో అభివృద్ధి చేయాలని చంద్రబాబు నిర్ణయించిన సంగతి తెలిసిందే.