: ఈనెల 18న భారత్ విచ్చేస్తున్న బంగ్లాదేశ్ అధ్యక్షుడు


ఈనెల 18న బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హమీద్ భారత్ విచ్చేస్తున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆహ్వానం మేరకు ఆయన మన దేశానికి రానున్నారు. సెరిమోనియల్ విజిట్ లో పాల్గొనాల్సిందిగా ప్రణబ్ ముఖర్జీ నుంచి తమ అధ్యక్షుడికి ఆహ్వానం అందిందని బంగ్లాదేశ్ హై కమిషనర్ సయ్యద్ ముజీమ్ అలీ తెలిపారు. ఆహ్వానం మేరకు హమీద్ భారత్ లో పర్యటిస్తారని చెప్పారు. ఈ పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోదీతో కూడా ఆయన సమావేశమవుతారు. ఈ భేటీలో భూ సరిహద్దు ఒప్పందాలపై వీరిరువురూ చర్చలు జరుపుతారు.

  • Loading...

More Telugu News