: సీబీఐ కస్టడీకి బెంగాల్ మంత్రి మదన్ మిత్రా
పశ్చిమబెంగాల్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత మదన్ మిత్రాను అలీపూర్ న్యాయస్థానం ఈ నెల 16 వరకు సీబీఐ కస్టడీకి పంపింది. కోట్ల రూపాయల శారదా చిట్ ఫండ్ స్కాంలో పలు ఆరోపణలపై సీబీఐ నిన్న (శుక్రవారం) మంత్రిని ఐదు గంటల పాటు ప్రశ్నించింది. అనంతరం ఆయన్ను అరెస్టు చేస్తున్నట్టు తెలిపింది. మరోవైపు పలువురు పార్టీ నేతలను వరుసగా సీబీఐ అరెస్టు చేయడంపై బీజేపీపైన, ప్రధానమంత్రి నరేంద్రమోదీపైన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. దీనిపై పార్లమెంటులో తమ ఎంపీలు నిరసన తెలుపుతారన్నారు. సహారా అధినేత సుబ్రతారాయ్ పక్కన మోదీ ఉన్నట్టు ఫొటోలు ఉన్నాయని, అలా అని మోదీని అరెస్టు చేయాలని సీబీఐని తాము కోరాలా? అని మమత ప్రశ్నించారు.