: ఈ రాత్రికి దుబాయ్ వెళుతున్న కేటీఆర్


తెలంగాణ పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ రాత్రికి దుబాయ్ వెళుతున్నారు. మూడు రోజుల పాటు ఆయన అక్కడ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా, దుబాయ్ పారిశ్రామిక వేత్తలతో కేటీఆర్ సమావేశమవబోతున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు. అలాగే, గల్ఫ్ దేశాల జైళ్లలో మగ్గుతున్న తెలంగాణ వాసులను స్వస్థలాలకు రప్పించేందుకు తగు ప్రయత్నాలు చేయనున్నారు. అంతేకాకుండా స్మార్ట్ సిటీలు, ఇండస్ట్రియల్ కారిడార్లు, ఫార్మాసిటీలను సందర్శించి పారిశ్రామికాభివృద్ధిని అధ్యయనం చేయబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, టీఎస్ఐఐసీ వైస్ ఛైర్మన్, ఎండీ జయేశ్ రంజన్ లతో కూడిన బృందం ఇప్పటికే దుబాయ్ చేరుకుంది.

  • Loading...

More Telugu News