: రుణమాఫీ సమస్యలపై టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు రుణమాఫీ ప్రక్రియ ఆరంభమైంది. రుణమాఫీకి సంబంధించి కొంతమంది రైతులకు పలు సందేహాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, రుణమాఫీ సమస్యలపై ఏపీ ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసింది. రుణమాఫీకి సంబంధించి ఏవైనా సమస్యలు, సందేహాలు ఉంటే ఈ నెంబర్లకు ఉచితంగా ఫోన్ చేయవచ్చు. ఫోన్ నెంబర్లు... 1100, 1800 425 4440, 1800 103 2066.