: సిఫారసులకు చోటు లేదు: టీటీడీ జేఈఓ శ్రీనివాస రాజు
వైకుంఠ ఏకాదశి వేడుకల్లో భాగంగా ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోబోమని తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ శ్రీనివాసరాజు స్పష్టం చేశారు. జనవరి 1ని పురస్కరించుకుని వైకుంఠ ఏకాదశి వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పిన ఆయన, దివ్య దర్శనం టికెట్ల జారీని నిలిపివేసినట్లు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. టికెట్ల కోసం ప్రజాప్రతినిధులు జారీ చేసే సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోలేమని ఆయన వెల్లడించారు. వీవీఐపీలకు కూడా పరిమిత సంఖ్యలోనే టికెట్లను జారీ చేయనున్నామని ఆయన పేర్కొన్నారు. సాధారణ భక్తులకు అసౌకర్యం కల్పించకూడదన్న భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.