: మత్తు మందిచ్చి మొత్తం దోచేశారు
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర ట్రైన్ లో దంపతులకు మత్తు మందిచ్చిన దుండగులు వారిని నిలువుదోపిడీ చేశారు. వారి నుంచి 60 వేల రూపాయల విలువైన నగలు ఎత్తుకుని పోయారు. మత్తు వదిలి చూసేసరికి ఆమె భర్త ఆచూకీ దొరకకపోవడంతో ఆమె భీమవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దంపతులు మొగల్తూరు మండలం కాళీపట్నం నుంచి విజయవాడ వస్తుండగా ఈ దారుణం చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.