: రూ.1 లక్ష మించే కొనుగోళ్లకు ఆధార్, పాన్ కార్డులుండాల్సిందే!


పండుగ పూట షాపింగ్ చేస్తున్నారా? పెళ్లి సందర్భాన్ని పురస్కరించుకుని నగలు కొంటున్నారా? అయితే ఆధార్, పాన్ కార్డులను వెంట తీసుకెళ్లండి. ఎందుకంటే రూ.1 లక్షకు పైగా విలువైన కొనుగోళ్లు జరపాలంటే, ఈ రెండింటిలో దేనినో, ఒకదానిని అక్కడ చూపించాల్సి ఉంటుంది. నల్లధనం వెలికితీతకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రతిపాదించిన ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. త్వరలోనే ఈ నిబంధనను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అంతేకాక ఆయా వ్యక్తులు వివిధ సందర్భాల్లో తమ గుర్తింపు కోసం చూపుతున్న డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డు తదితరాలను కూడా పాన్, ఆధార్ కార్డులకు అనుసంధానించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ తరహా నిబంధనలు అమలులోకి వస్తే, దేశంలో నల్లధనం చెలామణికి అడ్డుకట్ట పడినట్టేనన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News