: గవర్నర్ తో తెలంగాణ సీఎం భేటీ... మంత్రివర్గ విస్తరణపై చర్చ?
తెలంగాణ సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే శుక్రవారం ప్రధానితో భేటీ సందర్భంగా తెలుగు రాష్ట్రాల సమస్యలపై గవర్నర్ చర్చించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని గవర్నర్ శుక్రవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ప్రయోజనాలకు సంబంధించి తాజా పరిస్థితిని తెలుసుకునేందుకే కేసీఆర్, గవర్నర్ తో భేటీ అయ్యారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నా, మంత్రివర్గ విస్తరణపైనే ఆయన ప్రధానంగా ప్రస్తావించారని విశ్వసనీయ సమాచారం.