: పార్లమెంటుపై దాడి ఘటనలో మృతులకు మోదీ నివాళులు


పార్లమెంటుపై దాడి ఘటన మృతులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. పార్లమెంట్ భవన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాటి ఘటనలో మరణించిన భద్రతా సిబ్బందికి అంజలి ఘటించారు. ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, బీజేపీ సీనియర్ నేతలు ఎల్ కే అద్వానీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు కూడా ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, ప్రజాస్వామ్య సౌధాన్ని కాపాడిన వారి త్యాగం వృథా కాదని అన్నారు.

  • Loading...

More Telugu News