: అల్లుడు ఆణిముత్యమైతే...మామ స్వాతిముత్యం!: కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సెటైర్


తెలంగాణ ముఖ్యమంత్రి అల్లుడు హరీశ్‌ రావు ఆణిముత్యమైతే, మామ కేసీఆర్ స్వాతిముత్యమని తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రంగరెడ్డి జిల్లా తాండూరులో ఆయన మాట్లాడుతూ, అధికారంలోకి రాక ముందు దళిత, గిరిజనులకు డబుల్ బెడ్ రూం ఫ్లాట్లు నిర్మిస్తానని చెప్పిన కేసీఆర్, వాటి సంగతి వదిలేసి, ట్యాంక్ బండ్ చుట్టూ వంద అంతస్తుల భవనాలు నిర్మిస్తామని చెబుతున్నారని అన్నారు. దళిత, గిరిజనులకు పక్కా ఇళ్లు నిర్మిస్తానని ఎందుకు చెప్పడంలేదని ఆయన నిలదీశారు.అలాంటి అద్దాల మేడలు దొరల కోసమేనని ఆయన పేర్కొన్నారు. వాటర్ గ్రిడ్ పథకం కూడా కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకేనని ఆయన దుయ్యబట్టారు. కేసీఆర్ పేదల అజెండాను పక్కన పెట్టి, దొరల అజెండాను అమలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తరాలుగా జరుగుతున్న సంప్రదాయాన్ని తోసి రాజని, ప్రజల మనోభావాలు దెబ్బతినేలా వినాయక నిమజ్జనం హుస్సేన్‌ సాగర్‌ లో కాకుండా కృత్రిమంగా నిర్మించే చెరువులో చేయాలని చెప్పడం తగదన్నారు.

  • Loading...

More Telugu News