: అర్ధ శతకాలతో ఆశలు రేపుతున్న కోహ్లీ, విజయ్


బోర్డర్ అండ్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాలోని అడిలైడ్ లో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ బ్యాట్స్ మన్ ఆశలు రేపుతున్నారు. విజయమే లక్ష్యంగా, టీమిండియాను ఆలౌట్ చేయాలన్న ఆసీస్ కెప్టెన్ క్లార్క్ అంచనాలను టీమిండియా యువ ఆటగాళ్లు తల్లకిందులు చేసే దిశగా పట్టుదల ప్రదర్శిస్తున్నారు. 364 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా కేవలం 57 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ, యువకెరటాలు మురళీ విజయ్ (69), కెప్టెన్ విరాట్ కోహ్లీ (51) పరుగులతో రాణించారు. దీంతో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. భారత ఆటగాళ్లు ఇలాగే రాణిస్తే ఆసీస్ కెప్టెన్ ఎందుకు డిక్లేర్ చేశామా? అని చింతించే అవకాశం ఉంది. విజయానికి ఇంకా 224 పరుగులు కావాల్సి ఉండగా టీమిండియా చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్నాయి.

  • Loading...

More Telugu News