: ఇక ఉదయం 6 గంటలకే విధుల్లో ఉండాలి: బెజవాడ మేయర్, కమిషనర్లకు బాబు ఆదేశం


ఇకపై రోజూ ఉదయం ఆరు గంటలకే విధుల్లో ఉండాల్సిందేనని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విజయవాడ మేయర్ తో పాటు నగర పాలక సంస్థ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు నగరంలో ఆకస్మిక తనిఖీల్లో భాగంగా చంద్రబాబు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉంటే, చూసీచూడనట్టు వ్యవహరిస్తే ఎలాగంటూ ఆయన అధికారులతో పాటు పాలకవర్గాన్ని కూడా నిలదీశారు. ఇకపై నిత్యం అధికారులతో పాటు పాలకవర్గం కూడా ఉదయాన్నే నగర వీధుల్లోకి రావాల్సిందేనని ఆయన ఆదేశించారు. బెజవాడను సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్న ఆయన, ప్రభుత్వ సంకల్పం నెరవేరాలంటే అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం కావాలని అన్నారు. తమ మాదిరే ఉదయాన్నే నగర వీధుల్లోకి వెళ్లి నగర పరిశుభ్రతకు పాటుపడాలని ఆయన అధికారులు, ప్రజా ప్రతినిధులకు సూచించారు.

  • Loading...

More Telugu News