: ఢిల్లీ ఎన్నికల్లోనూ బీజేపీకే మెజారిటీ: ఒపినీయన్ పోల్స్ వెల్లడి


ఆప్ నేత, ఢిల్లీ తాజా మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈసారి అధికారం దక్కేలా లేదు. సార్వత్రిక ఎన్నికలతో పాటు మొన్నటి మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించిన బీజేపీ, ఢిల్లీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లోనూ తన జైత్రయాత్రను కొనసాగించనుందట. ఈ మేరకు శుక్రవారం వెలువడ్డ ఏబీపీ-నీల్సన్ నేతృత్వంలోని ఒపీనియన్ పోల్స్ బీజేపీకి మెజారిటీ వస్తుందని అంచనా వేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాదరణే బీజేపీకి పట్టం కట్టనుందని ఆ సర్వే తేల్చిచెప్పింది. మొత్తం 70 సీట్లలో 45 సీట్లను గెలుచుకోనున్న బీజేపీ ఢిల్లీ అసెంబ్లీలో సంపూర్ణ మెజారిటీ సాధిస్తుందట. ఇక గత ఎన్నికల్లో బీజేపీ సహా, కాంగ్రెస్ పార్టీలకు ముచ్చెమటలు పట్టించిన ఆప్ కు ఈ దఫా కేవలం 17 సీట్లలోనే విజయావకాశాలున్నాయి. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ అయితేనే బాగుంటుందంటూ 43 శాతం మంది ప్రజలు చెప్పారు. బీజేపీ నేత హర్షవర్ధన్ అభ్యర్థిత్వానికి కేవలం 39 శాతం మంది మాత్రమే మొగ్గుచూపారు.

  • Loading...

More Telugu News