: రష్యాతో బంధమా?: భారత్ కు అమెరికా అభ్యంతరం
రష్యాతో భారత్ బలమైన ద్వైపాక్షిక వాణిజ్య బంధానికి ఇది సరైన సమయం కాదని అమెరికా పునరుద్ఘాటించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మేరీ హార్పర్ మాట్లాడుతూ, భారత్ తో రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం నెరిపేందుకు ఇది సరైన సమయం కాదని అన్నారు. ఉక్రెయిన్ లో రష్యా అనుకూల వేర్పాటు వాదులకు మద్దతిస్తోందని ఆమె మండిపడ్డారు. పుతిన్ పర్యటన కారణంగా అణుశక్తి, చమురు, రక్షణ, పెట్టుబడులు వంటి 20 కీలక రంగాల్లో ఒప్పందాలు కుదరడంతో అమెరికా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అగ్రరాజ్యంగా భాసిల్లుతున్న అమెరికాను రష్యా అనుసరిస్తుండడంతో కంటగింపుగా మారింది. పాకిస్థాన్ లో అమెరికా బలమైన పెట్టుబడులు పెట్టి ప్రాబల్యాన్ని చాటుకుంటున్న దశలో పాక్ రక్షణ రంగంలో ఒప్పందాల ద్వారా రష్యా తన ప్రాబల్యం చూపింది. అలాగే అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటనకు ముందు పుతిన్ భారత్ వచ్చి కీలకమైన 20 అంశాల్లో ఒప్పందాలు చేసుకోవడం ఆసియాలో తన ప్రాబల్యం మసకబారలేదని చెప్పకనే చెప్పింది. దీంతో అమెరికా తాజా వ్యాఖ్యలు చేసింది.