: ఆసియాలో అత్యంత సంపన్నుడు అలీబాబానే... 32వ స్థానంలో ముఖేష్ అంబానీ


ఆసియాలో అత్యంత సంపన్నుడిగా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా అధినేత 'జాక్ మా' నిలిచారు. ప్రతి ఏటా సంపదను లెక్కగట్టి బిలియనీర్ల వివరాలు వెల్లడించే బ్లూమ్‌ బర్గ్ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం జాక్ మా ఆసియా వాసుల్లోని సంపన్నుల్లో అగ్రస్థానంలో నిలిచారు. 2012 ఏడాది నుంచి అత్యంత సంపన్న ఆసియావాసిగా ఉన్న హాంగ్‌ కాంగ్ రియాల్టీ, పోర్ట్స్ టైకూన్ లి క-షింగ్ ను జాక్ మా 2,860 కోట్ల డాలర్ల సంపదతో వెనక్కి నెట్టారు. దీంతో ఆయన మొదటి స్థానంలో నిలిచారు. జాక్ మా ఆదాయం కేవలం ఈ ఏడాదే 2,500 కోట్ల డాలర్లు పెరగడం విశేషం. ఫోర్బ్స్ జాబితాలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 8,540 కోట్ల డాలర్ల సంపదతో ప్రపంచ సంపన్నుల్లో అగ్రగణ్యుడిగా నిలిచారు. ఆ జాబితాలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ అత్యంత సంపన్న భారతీయుడిగా స్థానం సంపాదించుకున్నారు. కాగా ముఖేష్ సంపద 2,180 కోట్ల డాలర్లు. తాజా బ్లూమ్ బర్గ్ సర్వేలో ముఖేష్ అంబానీ 32వ స్థానంలో నిలవడం విశేషం.

  • Loading...

More Telugu News