: సమస్యలను చూసి పారిపోయే ప్రసక్తే లేదు: ఏపీ సీఎం చంద్రబాబు
సమస్యలను చూసి పారిపోయే తత్వం తనది కాదని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. నవ్యాంధ్ర రాజధానిని అద్భుతంగా నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలో కొత్తగా ఏర్పాటైన విపత్తు నిర్వహణ శాఖకు చెందిన కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో సమస్యలున్నా, వాటిని అధిగమిస్తామని ఆయన తెలిపారు. సౌకర్యాల లేమి ఉన్నప్పటికీ మొన్నటి హుదూద్ తుపానును సమర్ధవంతంగా ఎదుర్కొన్న తీరును గుర్తు చేసిన ఆయన, ప్రభుత్వ పాలనలోనూ ఇదే సూత్రాన్ని పాటిస్తామని చెప్పారు. ఇకపై విజయవాడ నుంచే ఆకస్మిక తనిఖీలు చేపడతామని ఆయన వెల్లడించారు.