: జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ తుది సమరానికి రంగం సిద్ధం


జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో తుది సమరానికి రంగం సిద్ధమైంది. ఈ రెండు రాష్ట్రాల్లో జరగాల్సిన నాలుగో విడత ఎన్నికల ప్రచారం కాసేపటి క్రితమే ముగిసింది. జమ్మూ కాశ్మీర్ లో ఈ నెల 14, 18 తేదీలలో ఎన్నికలు జరగనుండగా, భారత్, పాక్ సరిహద్దుల వెంబడి కీలక ప్రాంతాల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో భద్రతా బలగాలు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాయి. మరిన్ని కీలక ప్రాంతాల్లో సైన్యం రంగంలోకి దిగింది. కాగా జార్ఖండ్ లో నాలుగో విడత ఎన్నికలు ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్నాయి. 15 స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికల్లో మూడు స్థానాలు ఎస్సీ రిజర్వుడు కావడం విశేషం. రెండు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.

  • Loading...

More Telugu News