: హృతిక్ రోషన్ కు కూడా తప్పని నకిలీ బెడద
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కు కూడా నకిలీల బెడద తప్పలేదు. తన పేరిట ఎవరో నకిలీ ఈ మెయిల్ ఐడీతో నిర్మాతలను, ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని హృతిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ముంబైనగర పోలీస్ కమిషనర్ రాకేష్ మరియా మాట్లాడుతూ, ఫిర్యాదు అందిందని దీనిపై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. hroshan@email.com పేరిట మెయిల్ ఐడీతో తన అభిమానులను కొందరు మోసం చేస్తున్నారని హృతిక్ ఫిర్యాదులో పేర్కొన్నారు.