: రుణమాఫీపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్
ఆంధ్రప్రదేశ్ రైతుల రుణమాఫీ సమస్యలపై ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది. రుణమాఫీపై ఏవైనా సమస్యలు ఉంటే 1800 130 2066 అనే నెంబర్ కు ఫోన్ చేసి పరిష్కరింపజేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఆన్ లైన్ ఫిర్యాదుల కోసం గ్రీవెన్స్ పోర్టల్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు వారు వివరించారు. ఈ ఫిర్యాదులు స్వీకరించి, సమస్యలు పరిష్కరించేందుకు అనువుగా ఎమ్మార్వోలు, వీఆర్వోలు, బ్యాంకర్లకు వేర్వేరుగా ఐడీలు కేటాయించారు. దీంతో సమస్యలున్న రైతులు రుణమాఫీ సమస్యలపై ఎవర్ని సంప్రదించాలనే ప్రశ్నలకు ప్రభుత్వం పరిష్కారం చూపింది.