: కృష్ణా జలాల వివాదంపై చేతులెత్తేసిన రివర్ బోర్డు
కృష్ణా జలాల వివాదంపై రివర్ బోర్డు చేతులెత్తేసింది. సమస్యలను మీరే పరిష్కరించుకోవాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు కోరింది. ఇరు రాష్ట్రాల ఇంజినర్ ఇన్ చీఫ్ అభిప్రాయాలను రెండు రాష్ట్రాల విధానంగా తెలపాలని రివర్ బోర్డు చెప్పింది. కృష్ణా నీటి లభ్యత, వినియోగం, విద్యుత్ ఉత్పత్తిపై వివరణ ఇవ్వాలని కూడా రెండు రాష్ట్రాలను బోర్డు కోరింది. ఈ వివాదంపై ఇప్పటికే రెండు రాష్ట్రాలు కేంద్రానికి ఫిర్యాదు చేయగా బోర్డు వద్దే సమస్య పరిష్కరించుకోవాలని చెప్పిన సంగతి తెలిసిందే.