: ఇంత రుణమాఫీ దేశంలో ఎక్కడా లేదు: స్పీకర్ కోడెల


దేశంలో రూ.40వేల కోట్ల రుణమాఫీ ఇంత భారీగా చేయడం ఎక్కడా లేదని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. అయితే, రుణమాఫీలో కొన్ని సమస్యలున్నాయన్న ఆయన... బ్యాంకులు, రైతుల్లో నెలకొన్న సమస్యలు నివృత్తి చేయాల్సి ఉందని చెప్పారు. నెల్లూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అనేక సమస్యలున్నా చంద్రబాబు అద్భుతంగా పని చేస్తున్నారని కోడెల ప్రశంసించారు. ఈ నెల 18 నుంచి శాసనసభ శీతాకాల సమావేశాలు జరుగుతాయని వెల్లడించారు. రుణమాఫీ, కొత్త రాజధాని నిర్మాణంపై చర్చ సమావేశాల్లో జరగుతుందని వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి అసెంబ్లీని మంచి వేదికగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News