: శారదా చిట్ ఫండ్ స్కాంలో బెంగాల్ రవాణా మంత్రి అరెస్టు


సంచలనం సృష్టించిన శారదా చిట్ ఫండ్ స్కాం కేసులో పశ్చిమ బెంగాల్ రావాణా శాఖ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత మదన్ మిత్రాను సీబీఐ అరెస్టు చేసింది. ఈ విషయాన్ని సీబీఐ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ మధ్యాహ్నం శారదా గ్రూప్ ఆఫ్ కంపెనీల గురించి ఐదు గంటల పాటు సీబీఐ అధికారులు ఆయన్ను విచారించారు. అనంతరం నేరపూరిత కుట్ర, మోసం, దుర్వినియోగం, శారదా గ్రూప్ నుంచి మితిమీరిన ఆర్థిక ప్రయోజనాలు పొందటానికి సంబంధించి అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ స్కాంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు, పలువురు నేతలను విచారించి అరెస్టు చేసిన సీబీఐ, అనేకమంది అధికారులను కూడా ప్రశ్నించింది.

  • Loading...

More Telugu News