: రాళ్ళతో కొట్టి, గుండెను పెకిలించి... ఢిల్లీలో యువకుని దారుణ హత్య


చూపరులకు భీతి కలిగించేలా దేశ రాజధానిలోని భాతి మైన్స్ ప్రాంతంలో దారుణ హత్య జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం గుర్తుపట్టలేని విధంగా ఉన్న ఓ మృతదేహం లభించింది. తల నరికి, గుండెను తొలగించి, మర్మాంగాలను కోసి చెల్లా చెదురుగా పడేసి ఉన్నారు. చేతిపై ఉన్న టాటూ ఆధారంగా, అక్కడికి 500 మీటర్ల దూరంలో నివాసముండే 18 సంవత్సరాల కులదీప్ మృతదేహమని పోలీసులు గుర్తించారు. తన కుమారుడిని రాళ్ళతో కొట్టి చంపారని మృతుడి తల్లిదండ్రులు ఆరోపించారు. ముక్కోణపు ప్రేమ లేదా మరేదైనా శత్రుత్వంతో ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు కులదీప్ కొరియర్ బాయ్ గా పనిచేస్తున్నట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News