: భారత్-పాక్ హాకీ సెమీస్ మ్యాచ్ టికెట్లకు డిమాండ్


చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ హాకీ జట్ల మధ్య జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. భువనేశ్వర్ లో రేపు జరగనున్న మ్యాచ్ చూసేందుకు అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు. దాంతో, ఉదయం నుంచే ఇక్కడి కళింగ స్టేడియంలో టికెట్ల కోసం బారులు తీరారు. ఒక వ్యక్తికి రెండు టికెట్లు మాత్రమే ఇస్తామని హాకీ ఇండియా అధికారులు ప్రకటించారు. తాను ఉదయం ఆరు గంటల నుంచే టికెట్ల కోసం లైన్లో నిలుచున్నానని, మూడు గంటల తరువాత ఎట్టకేలకు రెండు టికెట్లు సంపాదించానని, మ్యాచ్ ను అస్సలు మిస్ అవనని ప్రియాంక ప్రియదర్శిని అనే కళాశాల విద్యార్థిని అంటోంది. ఇదిలాఉంటే మరోవైపు ఆన్ లైన్ మ్యాచ్ టికెట్లకు బాగానే డిమాండ్ ఉండటంతో కొన్ని గంటల్లోనే అమ్ముడుపోయాయట. మరోవైపు టిక్కెట్లు కొరత కారణంగా వంద, నూట యాభై రూపాయల టికెట్లను కొంతమంది బ్లాక్ లో రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు అమ్ముతున్నారు.

  • Loading...

More Telugu News