: ప్రతి శుక్రవారం ఫేస్‌బుక్ ఉచితం: రిలయన్స్
తమ కస్టమర్లకు ప్రతి శుక్రవారం ఫేస్ బుక్ సర్వీసులను ఉచితంగా అందించాలని నిర్ణయించినట్టు రిలయన్స్ కమ్యూనికేషన్స్ వెల్లడించింది. జీఎస్‌ఎం ప్రీ-పెయిడ్ వినియోగదారులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని, ఎలాంటి డేటా చార్జీలు వసూలు చేయబోమని సంస్థ సీఈవో గురుదీప్ సింగ్ తెలిపారు. ఈ సర్వీసులు అందుకోవాలంటే రూ.50 నుంచి రూ.100 లోపు రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే రూ.100 కంటే అధికంగా రీచార్జ్ చేసుకున్నవారికి ఫేస్ బుక్‌తో పాటు వాట్స్ యాప్ ను కూడా రిలయన్స్ ఉచితంగా అందచేయనున్నది.