: ఒక్కరి తప్పుకు ఇంతమందికి శిక్షా?... ఉబెర్ పై నిషేధం ఎత్తివేయాలని ఆందోళన
ఉబెర్ సంస్థ క్యాబ్‌లపై నిషేధం విధించడం పట్ల ఆ సంస్థ క్యాబ్ డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. ఒక్కరు చేసిన తప్పుకు ఇంతమంది అమాయక డ్రైవర్ లకు ఉపాధి లేకుండా చేయడం తగదని వారంతా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఉబెర్ క్యాబ్ సర్వీసులపై నిషేధాన్ని ఎత్తివేయాలని వందలాది మంది క్యాబ్ డ్రైవర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిషేధం వల్ల తమ కుటుంబాల్లో పూట గడవటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉబెర్ సంస్థ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం చేసి సొంత వాహనాలను కొనుక్కునేలా ప్రోత్సహించిందని ఒక డ్రైవర్ వివరించాడు. కాగా, ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగినిపై ఉబెర్ క్యాబ్ డ్రైవర్ శివకుమార్ అత్యాచారానికి పాల్పడటంతో, ఆ సంస్థ క్యాబ్ లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.