: హీరోయిన్ కేథరిన్ థ్రెసా సోదరుడు ఆత్మహత్య
'ఇద్దరమ్మాయిలు' సినిమా ఫేం కేథరిన్ థ్రెసా సోదరుడు క్రిస్టఫర్ ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగళూరులోని మురుగేష్ పాలియా ప్రాంతంలోని తన నివాసంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆర్థిక సమస్యల కారణంగా క్రిస్టఫర్ ఉరి వేసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. గత కొంతకాలంగా ఇతను తన కుటుంబానికి దూరంగా ఉంటూ చదువుకుంటున్నాడు. సోదరుడి మరణ వార్తతో కేథరిన్ షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని చైన్నై నుంచి బెంగళూరు చేరుకుంది.