: ఇద్దరు చంద్రులూ బాగానే పనిచేస్తున్నారని చెప్పా: గవర్నర్


తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావులు బాగానే పనిచేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పానని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చెప్పారు. కొద్దిసేపటి క్రితం పార్లమెంట్ లో ప్రధానితో భేటీ ముగించుకుని వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో శాంతి భద్రతలు కూడా అదుపులోనే ఉన్నాయని ప్రధానికి వివరించానని ఆయన వెల్లడించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై ప్రధానికి నివేదిక ఇచ్చినట్లు నరసింహన్ తెలిపారు.

  • Loading...

More Telugu News