: 'గాడ్సే' అంశంపై దద్దరిల్లిన లోక్ సభ
నాథూరామ్ గాడ్సే అంశం లోక్ సభను అట్టుడుకిస్తోంది. మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడని సంబోధించిన బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ వ్యాఖ్యలపై రెండోరోజు కూడా పార్లమెంటు దద్దరిల్లింది. ఎంపీ సాక్షి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని... దీనికి సంబంధించి ప్రధాని మోదీ ప్రకటన చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. తీవ్ర గందరగోళం నెలకొనడంతో సభను 10 నిమిషాల పాటు స్పీకర్ సుమిత్రా మహాజన్ వాయిదా వేశారు.