: బాలీవుడ్ నటిని కారులోంచి బయటకు లాగి, నడిరోడ్డుపై వేధించిన వ్యాపారవేత్త


'ట్రాఫిక్ సిగ్నల్', 'జరా సంభాల్ కె' తదితర చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటి యోగితా దండేకర్ ను ముంబైలోని జుహు సమీపంలో వ్యాపారవేత్త హన్సరాజ్ సురాన, ఆయన కారు డ్రైవర్ కృష్ణ కుమార్ వైద్యనాథ్ లు వేధించినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. తనను కారు నుంచి బయటకు లాగి పదేపదే చెంపపై కొట్టారని యోగిత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. మొత్తం 10 నిమిషాల పాటు మాటలతో, చేతలతో తనను వేధిస్తున్నా చుట్టూ ఉన్నవారిలో ఎవరూ తనకు సాయం చేసేందుకు ముందుకు రాలేదని ఆమె వాపోయారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసునమోదు చేసి రిమాండ్ కు పంపామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News