: వార్నర్ సెంచరీల మోత... రెండో ఇన్నింగ్స్ లోనూ శతకం
భారత్-ఆస్ట్రేలియాల మధ్య అడిలైడ్ లో జరుగుతున్న తొలి టెస్టులో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ శతకాల మోత మోగించాడు. తొలి ఇన్నింగ్స్ లో 145 పరుగులు చేసిన వార్నర్ రెండో ఇన్నింగ్స్ లోనూ సెంచరీ కొట్టాడు. మొత్తం 154 బంతులను ఎదుర్కొన్న వార్నర్ 11 ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో సెంచరీ పూర్తి చేశాడు. వార్నర్ బ్యాటింగ్ తో ఆసీస్ పటిష్ఠ స్థితిలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసిన ఆస్ట్రేలియా ఇప్పటికే 268 పరుగుల ఆధిక్యత సాధించింది. నాలుగో రోజు ఆటలో మరో 22 ఓవర్లు మిగిలి ఉన్నాయి. వార్నర్ కు తోడుగా స్టీవెన్ స్మిత్ (14) క్రీజులో ఉన్నాడు.