: సాయంత్రం నుంచి ఇంటర్నెట్ లో రుణమాఫీ రెండవ జాబితా
ఈ సాయంత్రం నుంచి ఇంటర్నెట్ లో రుణమాఫీ రెండవ జాబితా అందుబాటులో ఉంటుందని ఐటీ సలహాదారు జె.సత్యనారాయణ తెలిపారు. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన ఆయన దానిపై చర్చించారు. ఇటీవలే రుణమాఫీ తొలి జాబితాను విడుదల చేసిన ప్రభుత్వం మళ్లీ కొన్ని రోజులకే రెండవ జాబితాను పెట్టడం విశేషం.