: మోదీతో గవర్నర్ భేటీ... ఇరు రాష్ట్రాల సమస్యల నివేదన


ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. పార్లమెంట్ ఆవరణలో జరిగిన ఈ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. భేటీలో భాగంగా తెలుగు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర నివేదికను గవర్నర్, ప్రధానికి నివేదించారు. ఇరు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు వాటి మధ్య నెలకొన్న వివాదాలనూ ఆయన ప్రధానికి వివరించినట్లు సమాచారం. ఈ నివేదికపై ప్రధాని మోదీ ఏ విధంగా స్పందించారన్న విషయం తెలియరాలేదు. మూడు రోజుల క్రితం ఢిల్లీ వచ్చిన నరసింహన్ ఎట్టకేలకు నేడు ప్రధానితో భేటీ కాగలిగారు.

  • Loading...

More Telugu News