: ఆసీస్, టీమిండియా ఆటగాళ్లు గరం గరం... మైదానంలో వేడెక్కిన వాతావరణం


భారత్ - ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ లో జరుగుతున్న తొలి టెస్ట్ నాలుగో రోజున ఇరుజట్ల ఆటగాళ్ళు సంయమనం కోల్పోవడంతో మైదానంలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. నేటి ఆటలో 66 పరుగుల వద్ద వార్నర్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. వెంటనే ధావన్‌ కాస్తంత అతిగా స్పందించడం, ఆ వెంటనే ఆ బాల్ నోబాల్ అని అంపైర్ తేల్చడంతో, వార్నర్‌ మెల్లగా ధావన్ దగ్గరకు వచ్చి ఓ సీరియస్ లుక్కిచ్చి ఏదో అన్నాడు. ఇద్దరి మధ్యా మాటలు పెరిగాయి. ఒక్కసారిగా ఇరు జట్ల ఆటగాళ్లు సహనం కోల్పోతున్న పరిస్థితి కనిపించింది. ఆటగాళ్లను అదుపు చేసేందుకు ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, అంపైర్లు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News