: మమ్మల్ని కాపాడండి: మోదీ, బిగ్ బి, సచిన్, ఖాన్ త్రయానికి ఓ నటీమణి బహిరంగ లేఖ


బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ ఓ చిత్రంలో నటించిన మాజీ వీజే షెనాజ్ ట్రెజరీవాలా తాజాగా అత్యాచారాలపై గళమెత్తింది. ఇటీవలే ఢిల్లీలో ఓ క్యాబ్ లో యువతి అత్యాచారానికి గురికావడంపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలపై వేధింపులను నిరసిస్తూ ఆమె ప్రధాని నరేంద్ర మోదీ, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, వ్యాపార దిగ్గజం అనిల్ అంబానీ, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సూపర్ స్టార్ త్రయం సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ లకు బహిరంగ లేఖ రాసింది. స్త్రీలపై అత్యాచారాలు, దాడులు, హింసపై పోరాటంలో సాయం చేయాలని వారిని అభ్యర్థించింది. రేపిస్టులకు బెయిల్ ఇవ్వరాదని, మరణశిక్షే సరైనదని స్పష్టం చేసింది. తమను (మహిళలను) కాపాడాలని కోరింది. అత్యాచారాలకు పాల్పడిన వారికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేయాలని పై ప్రముఖులను కోరింది. ప్రభుత్వం కఠిన చట్టాలు రూపొందిస్తే పర స్త్రీలను తాకాలంటేనే మగవాళ్లు భయపడతారని అభిప్రాయపడింది. మోదీ, అంబానీ, అమితాబ్, సచిన్, సల్మాన్, షారుఖ్, అమీర్ తదితరులు దీన్ని తక్షణ ప్రాధాన్య అంశంగా భావించి, రంగంలోకి దిగితే ఎంతో మార్పు వస్తుంది కదా? అంటూ షెనాజ్ తన లేఖలో పేర్కొంది.

  • Loading...

More Telugu News