: మీరు దోచిన డబ్బు చాలా ఉంది... వదిలి పెట్టం: జగన్ పై బాబు పరోక్ష వ్యాఖ్యలు


మీరు దోచుకున్న డబ్బు చాలా ఉంది... వదిలిపెట్టే ప్రసక్తే లేదని వైకాపా అధినేత జగన్ ను ఉద్దేశించి సీఎం చంద్రబాబు పరోక్ష హెచ్చరికలు చేశారు. అవినీతి సొమ్ముతో పెట్టుకున్న టీవీ చానళ్లు, పత్రికల్లో తప్పుడు ప్రచారాలు చేస్తూ, వారి ఫొటోలు మాత్రమే వేసుకున్నారని... ఇతరుల ఫొటోలు వేయలేదని... ఇలాంటి చర్యలతో అధికారం రాదనే విషయం తేలిపోయిందని అన్నారు. తాను ప్రసంగించిన తర్వాత ఎవరో ఓ నాయకుడు వస్తాడని, ఏదో గొణుగుతాడని... ఆ వార్తలన్నింటినీ అవినీతి పత్రికలలో ప్రముఖంగా ప్రచురిస్తారని విమర్శించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తాను రైతు రుణమాఫీ చేస్తే... దానిపై అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News