: 'అత్త' సహా పలువురిపై ఉబెర్ క్యాబ్ డ్రైవర్ అత్యాచారం... వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు


ఉబెర్ క్యాబ్ డ్రైవర్ శివకుమార్ యాదవ్ గత చరిత్రను విచారిస్తుంటే, పోలీసులే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. శివకుమార్ తమను అత్యాచారం చేశాడంటూ ఇప్పటివరకూ 6 ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది. తనను 'అత్తా' అని పిలుస్తూ, ఓ రోజు రాత్రి శివకుమార్ తనపై అత్యాచారం చేశాడని, బయటకు చెబితే కుటుంబ పరువు పోతుందని బాధను దిగమింగానని 46 ఏళ్ల మహిళ ఒకరు వాపోయారు. రాంనగర్ పరిధిలో మరో ఇద్దరు యువతులపై కూడా శివకుమార్ అత్యాచారం చేశాడని తెలుస్తోంది. బాధితుల్లో ఒకరు శివకుమార్ పై కేసు పెట్టగా, అది ఇప్పటికీ విచారణ దశలోనే ఉంది. 2011లో గుర్గావ్ లో బార్ డాన్సర్ పై అత్యాచారం సహా అతనిపై ఇప్పుడు మొత్తం 6 కేసులు ఉన్నాయి. మరో మహిళ తన బాధను తెలుపుతూ, "2013లో ఇదే శివకుమార్ గన్ పాయింట్ సమీపంలో అత్యాచారం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తే, దాన్ని స్వీకరించేందుకు వారు నిరాకరించారు" అని వివరించింది. కాగా, పోలీసులు ఇప్పుడా కేసులన్నింటినీ తిరగదోడే పనిలో బిజీగా ఉన్నారు.

  • Loading...

More Telugu News