: మాత్రలు వాడకపోతే చస్తావని డాక్టర్లు చెప్పారు: కేసీఆర్


ఏభై రెండేళ్ల వయసు వచ్చేంత వరకు డాక్టర్ తో తనకు పని రాలేదని... ఏనాడూ ఆసుపత్రికి కూడా వెళ్లలేదని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తొలిసారిగా బీపీ వచ్చిందని చెప్పారు. డాక్టర్ ను సంప్రదిస్తే... ఎక్కువ టెన్షన్ ఉండేవారికి, ఎక్కువ ఆలోచించే వారికి బీపీ వస్తుందని చెప్పారని అన్నారు. బీపీకి మాత్రలు వాడకపోతే ఏమవుతుందని డాక్టర్లను అడిగానని... వాడకపోతే చస్తావని వారు సమాధానమిచ్చారని తెలిపారు. కేసీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నారని ఈ మధ్య కాలంలో పలు వదంతులు వినిపిస్తుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News