: క్రిస్ మస్ రోజున మత మార్పిడుల కోసం ఆరెస్సెస్ చందాల వసూలు!


దేశంలో మత మార్పిడుల అంశం తీవ్ర చర్చనీయాంశమైన క్రమంలో రాష్ట్రీయ స్వయం సంఘ్ (ఆరెస్సెస్) దానికి మరింత ఆజ్యం పోసేలా వ్యవహరిస్తోందన్న వాదన వినిపిస్తోంది. క్రైస్తవుల పర్వదినం క్రిస్ మస్ రోజున అలీఘడ్ లో పెద్ద ఎత్తున మత మార్పిడులను చేపట్టనున్నట్లు బీజేపీ ఎంపీ ఆదిత్యనాథ్ ప్రకటిస్తే, ఆ కార్యక్రమానికి అవసరమయ్యే నిధులను సేకరించే పనిని ఆరెస్సెస్ అనుబంధ విభాగం ధరమ్ జాగారణ్ సమితి భుజానికెత్తుకుంది. హిందూ మతాన్ని స్వీకరించనున్న క్రైస్తవులు, ముస్లింలకు ఆ సంస్థ భారీ నజరానాలను ప్రకటించింది. హిందూ మతాన్ని స్వీకరించే క్రైస్తవుడికి రూ.2 లక్షలు, అదే ముస్లిం వ్యక్తి హిందువుగా మారితే రూ.5 లక్షల నజరానాను ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున నిధులు అవసరమవుతున్నాయి. వీటిని సమీకరించేందుకు ఆ సంస్థ చందాల సేకరణను ప్రారంభించింది. ఇందుకోసం ముద్రించిన కరపత్రంపై ఆ సంస్థ లెటర్ హెడ్ కూడా వుండడం గమనార్హం.

  • Loading...

More Telugu News