: ఇస్లామిక్ స్టేట్ ఆన్ లైన్ నియామకాలకు బెంగళూరు ఉద్యోగి సహకారం!


బెంగళూరు కేంద్రంగా ఓ ఇండియన్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు ఇస్లామిక్ స్టేట్ ఆన్ లైన్ నియామకాలకు సహకరిస్తున్నాడని, లక్షల మంది చూస్తున్న ఐఎస్ ట్విట్టర్ ఖాతాను నిర్వహిస్తోంది అతనేనని బ్రిటన్ కు చెందిన 'ఛానల్ 4' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. 'షమీ విట్నెస్' పేరిట అతను నిర్వహిస్తున్న ట్విట్టర్ ఖాతాను 17,700 మంది ఫాలో అవుతున్నారని, నెలలో 20 లక్షల మంది అతని పోస్టులను చూశారని తెలిపింది. ఆ వ్యక్తి పేరు 'మెహ్ది'తో మొదలవుతుందని, అతనితో తాము మాట్లాడామని వెల్లడించింది. జిహాదీలు, ఉగ్రవాద మద్దతుదారులు, నియామకాలు జరిపే వారికి ఈ ఖాతా ఒక వారధిగా నిలిచిందని ఛానల్ 4 పేర్కొంది. బ్రిటిష్ జీహాదీలతో తానూ ఎప్పటికప్పుడు మాట్లాడుతుంటానని ఆ వ్యక్తి తెలిపినట్టు వెల్లడించింది. కాగా, ఈ కథనంపై భారత ప్రభుత్వ అధికారులు ఇంకా స్పందించలేదు.

  • Loading...

More Telugu News