: రజనీకాంత్ కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు


ప్రముఖులకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. మొన్న సోనియాగాంధీ, నిన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన మోదీ, నేడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూ బర్త్ డే విషెస్ తెలిపి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. సినీ నటుడికి రాజకీయ నేత, అది కూడా ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం అరుదే కదా. తన ప్రకనటలను విడుదల చేసేందుకు వినియోగిస్తున్న ట్విట్టర్ ద్వారానే రజనీకి మోదీ శుభాకాంక్షలు చెప్పారు. నిండు నూరేళ్ల పాటు రజనీకాంత్ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ సందేశంలో మోదీ ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే, నేడు జన్మదినం జరుపుకోనున్న ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ కూ మోదీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా బర్త్ డే విషెస్ చెప్పారు.

  • Loading...

More Telugu News